POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ గ్రామాల్లో భారీగా కురుస్తున్న మంచు
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ గ్రామాల్లో భారీగా కురుస్తున్న మంచు
Snowfall: దట్టంగా కురుస్తున్న మంచుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీలం లోయలోని అరంగ్ గ్రామంలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఇళ్లపై దట్టంగా మంచు పేరుకుపోయి స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో మంచు దట్టంగా కురుస్తోందని అధికారులు తెలిపారు. నివాసాలు, రోడ్లు ఎక్కడ చూసిన శ్వేత వర్ణంలో మంచు గడ్డకట్టుకుపోయింది. దీంతో జనం కనీసం నిత్యావసరాలకు కూడా బయటకు రాలేకపోతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాలు, నీళ్లు, కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా వీలు పడటం లేదు. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై దట్టంగా పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వందల కొద్ది హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. ఫలితంగా పశువులకు పశుగ్రాసం కూడా దొరకడం లేదు. క్రూరమృగాలు జనావాసాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో జనం హడలిపోతున్నారు.