America: అమెరికాలో కాల్పుల కలకలం

America: కొలరాడోలోని సూపర్‌మార్కెట్‌లో దుండగుడి కాల్పులు * పోలీస్ అధికారి సహా పది మంది మృతి

Update: 2021-03-23 04:29 GMT
Gun Firing Issue in America

Representational Image

  • whatsapp icon

America: అమెరికాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. అట్లాంటాలో కాల్పులు జరిగిన ఘటన మరవక ముందే.. కొలరాడోలో మరో వ్యక్తి గన్‌తో హల్‌చల్‌ చేశాడు. పది మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్నాడు.

కొలరాడోలోని బోల్డర్‌ ప్రాంతంలోని కింగ్‌ సూపర్‌మార్కెట్‌పై ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా స్టోర్‌పై దాడి చేశాడు. దీంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News