H1B Visa: హెచ్ 1-B వీసాదారులకు శుభవార్త

H1B Visa: గ్రేస్ పిరియడ్‎ను పెంచిన అమెరికా.. ఉద్యోగం పోతే 2 నెలల్లో స్వదేశానికి రావాలి

Update: 2023-03-16 03:25 GMT

H1B Visa: హెచ్ 1-B వీసాదారులకు శుభవార్త

H1B Visa: హెచ్ 1-B వీసాపై అమెరికా వెళ్లిన వారికి శుభవార్త. ప్రస్తుతం అమెరికాలో దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. హెచ్ 1-B వీసాపై వెళ్లిన వారికి ఉద్యోగం పోతే, రెండు నెలల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లాలి. అయితే ఇప్పడు ఈ గ్రేస్ పెరియడ్ ను ఆరు నెలలకు పెంచింది అక్కడి ప్రభుత్వం. హెచ్‌1-బీ వీసాదారులకు ఇస్తున్న గ్రేస్‌ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలంటూ అమెరికా అధ్యక్షుని సలహా ఉపసంఘం సిఫారసు చేసింది. హెచ్‌1-బీ వీసాపై అమెరికాకు వచ్చినవారు తాము చేస్తున్న పనిని వదిలేసినా లేదా వారిని సంస్థ తొలగించినా కొత్త సంస్థలో అరవై రోజుల్లోగా చేరాలనే నియమం ఇప్పటివరకు ఉంది. లేదంటే తట్టాబుట్టా సర్దుకుని సొంత దేశాలకు వెళ్లాల్సిందే.

అయితే, వారికి మరింత అదనపు సమయం ఇవ్వడం కోసం గ్రేస్‌ పీరియడ్‌ను పెంచాలని వలససేవల విభాగం, హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్టుమెంటులకు ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ఉపసంఘంలో సభ్యుడు అజయ్‌ జైన్‌ భుటోరియా ప్రజంటేషన్‌ ఇచ్చారు. చేస్తున్న పని పోయి కొత్త ఉపాధిని సంపాదించుకోవడం హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో చాలా కష్టంగా ఉన్నదని ఆయన తెలిపారు. హెచ్‌-1బీ హోదా బదిలీకి సంబంధించిన పత్రాలు సంపాదించుకోవడంలోని సంక్లిష్టత, వలస సేవల విభాగంలో దరఖాస్తు పరిశీలనకు ఎక్కువ కాలం పడుతుండటం వంటి కారణాల వల్ల ఇప్పుడు ఇస్తున్న గ్రేస్‌ పీరియడ్‌ సరిపోవడం లేదన్నారు. దానివల్ల చాలామంది బలవంతంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. అందువల్ల ఇప్పుడిస్తున్న గ్రేస్‌ పీరియడ్‌కు అదనంగా మరో 120 రోజులు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News