నాడు ఆర్థిక శాఖ మంత్రి.. నేడు క్యాబ్‌ డ్రైవర్‌

Afghanistan: ఆర్థిక శాఖ మంత్రిగా ఒకప్పుడు చక్రం తిప్పాడు.. ఇప్పుడు పొట్టకూటి కోసం చక్రం పట్టాడు.

Update: 2022-03-21 14:30 GMT

నాడు ఆర్థిక శాఖ మంత్రి.. నేడు క్యాబ్‌ డ్రైవర్‌

Afghanistan: ఆర్థిక శాఖ మంత్రిగా ఒకప్పుడు చక్రం తిప్పాడు.. ఇప్పుడు పొట్టకూటి కోసం చక్రం పట్టాడు. ట్యాక్సీ తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేదో సినిమాలోని దృశ్యం అనుకుంటే పొరపాటు.. ఇది రీల్‌ లైఫ్‌ కాదు.. అఫ్ఘానిస్థాన్‌ మాజీ మంత్రి ఖలీద్‌ పయెండా రియల్‌ లైఫ్‌. ఇంతకు మాజీ మంత్రి ఖలీదా పరిస్థితి ఎందుకు తలకిందులయ్యింది? క్యాబ్‌ డ్రైవర్‌గా ఎందుకు మారాడు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

అఫ్ఘానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా చక్రం తిప్పాడు ఖలీద్‌ పయెండా ఇప్పుడు వాషింగ్టన్‌లో ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు,. రోజుకు ఆరు గంటల పాటు శ్రమించి.. 150 డాలర్లను సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆరు గంటల కంటే ఎక్కువగా ఆయన పని చేయలేకపోతున్నారు. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే ముందువరకు దేశంలో ఖలీద్‌ పయెండా తాను ఎంతంటే అంత అన్నట్టుగా వ్యవహరించారు. తాలిబన్లు తనను ఎలాగూ వదలరనే భయంతో 2021 ఆగస్టు 10న కుటుంబంతో సహా అమెరికాకు బయలుదేరారు.

2021 ఆగస్టు 10న అఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు చుట్టుముట్టారు. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో పాటు మంత్రులు దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే ఘనీతో పాటు మంత్రులు దేశ ఖజానాను దోచుకుని వెళ్లిపోయారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా ఘనీ హయాంలోని ఆర్థిక శాఖ మంత్రి ఖలీద్‌ మాత్రం వాషింగ్టన్‌ డీసీలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈయనే కాకుండా ఘనీ కేబినెట్‌లోని మరో మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. తాలిబన్లు 2021 ఆగస్టు 15న తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో వేలాది మంది ఆఫ్ఘాన్‌ ప్రజలు బస్సుల్లో కిక్కిరిసినట్టు అప్పట్లో విమానాల్లో ఎక్కి వెళ్లిపోయారు. వారంతా పలు దేశాల్లో తలదాచుకున్నారు.

తాలిబన్ల దాడితో ఆఫ్ఘానిస్థాన్‌ పూర్తిగా ధ్వంసమైంది. కాబూల్‌ను ఆక్రమించుకున్న తరువాత తాలిబ్లను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేశ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు అధ్వానంగా మారాయి. సాయం కోసం తాలిబన్లు ప్రపంచ దేశాలవైపు చూస్తున్నారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని పలు దేశాలు ఖరాఖండీగా చెప్పాయి. ప్రస్తుతం తాలిబన్లకు కేవలం చైనా మాత్రమే సాయం చేస్తోంది. అక్కడి ఖనిజవరులను సొంతం చేసుకునేందుకు ఎత్తుగడ వేసింది. 

Tags:    

Similar News