దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం.. 735 అడుగుల ఎత్తులో మూన్‌

*చంద్రుడిని తలపించేలా రిసార్ట్‌ నిర్మాణం

Update: 2022-09-13 13:30 GMT

దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం.. 735 అడుగుల ఎత్తులో మూన్‌

Dubai: దుబాయ్‌ అంటేనే.. అద్భుత కట్టడాలకు మారుపేరు, తాజాగా పర్యాటకులను ఆకర్షించేందుకు మరో లగ్జరీ నిర్మాణానికి దుబాయ్‌ శ్రీకారం చుట్టింది. నిజమైన చంద్రుడిని తలపించేలా భారీ రిసార్ట్‌ నిర్మాణాన్ని తలపెట్టింది. 735 అడుగుల ఎత్తులో 500 కోట్ల డాలర్లతో రెండేళ్లలో ఈ రిసార్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును కెనడాకు చెందిన ఆర్కిటెక్చరల్‌ కంపెనీ చేపట్టింది. మూన్‌ దుబాయ్‌ పేరుతో ఈ రిసార్టును నిర్మిస్తున్న ఎమిరేట్స్‌ టూరిజం రంగ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్‌, నైట్‌ క్లబ్‌, ఈవెంట్‌ సెంటర్లు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. అంతేకాదు వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనే పర్యాటకులకు కూడా ఇందులో శిక్షణ ఇస్తారట.

ప్రపంచ పర్యాటకలను, వ్యాపారులను ఆకర్షించేందుకు టూరిజంపై యునైటెడ్‌ ఎమిరట్స్‌ ఆఫ్‌ అరబ్ భారీగా వెచ్చిస్తోంది. అందుకు వినూత్నమైన నిర్మాణాలను చేపడుతోంది. సముద్రంలో దుబాయ్‌ మాల్‌, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా, బుర్జ్‌ ఆల్‌ అరబ్‌లతో పాటు కృత్రిమ నిర్మించిన ఫామ్‌ జుమైరా పర్యాటకులను, వీఐపీలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాటి సరసన మరో అద్భుత కట్టడంగా ఈ మూన్‌ రిసార్ట్‌ చేరనున్నది. అచ్చం చంద్రుడిని పోలిన ఆకారంలో దీన్ని నిర్మిస్తున్నారు. దీన్ని చూస్తే.. నింగిలోని చంద్రుడిని చూసిన భావన కలుగుతుంది. ఈ మూన్‌ రిసార్ట్‌ను ఏటా కోటి మంది పర్యటించేలా నిర్మిస్తున్నారు. ఇక ఇక్కడే కాకుండా.. నార్త్‌ అమెరికా, ఐరోపా, మిడిల్‌ ఈస్ట్, నార్త్‌ ఆఫ్రికా దేశాల్లోనూ నిర్మించడానికి మూన్‌ వరల్డ్‌ రిసార్ట్‌ సిద్ధమవుతోంది. 

Tags:    

Similar News