Elon Musk: ట్విట్టర్ కోసం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రయత్నాలు
Elon Musk: షేర్‌కు 54.2 డాలర్లు చెల్లిస్తానని ఆఫర్
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) తన దృష్టంతా ట్విట్టర్‌పైనే పెట్టారు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 43 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తన ప్రతిపాదనను అంగీకరిస్తే బోర్డు సభ్యుల జీతం సున్నా చేస్తే సంవత్సరానికి 3 మిలియన్ డాలర్లు సంస్థకు మిగులుతాయంటూ తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలనుకున్న మాస్క్ ఎత్తుగడలను బోర్డు అడ్డుకునేందుకు పాయిజన్ పిల్‌ను తెరపైకి తెచ్చింది.
సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై టెస్లా(Tesla) సీఈవో ఎలాన్ మస్క్ కన్నేశారు. దాన్ని కొనుగోలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ట్విట్టర్‌ను అమ్మేయాలంటూ రెండ్రోజుల క్రితం మస్క్ ప్రతిపాదనలు చేశారు. ఒక్కో షేర్‌కు 54.2 డాలర్లను చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చారు. మొత్తం షేర్ల కోసం 4 కోట్లా 13 లక్షల డాలర్లను చెల్లిస్తానని మస్క్ లేఖ పంపినట్టు స్టాక్ మార్కెట్లకు ట్విట్టర్ సంస్థ తెలిపింది. దీంతో ట్విటర షేర్లు 12 శాతానికి ఎగబాకాయి. ఇప్పటికే ట్విటర్‌లో 9.2 శాతం షేర్లను మస్క్ కొనుగోలు మస్క్ కొనుగోలు చేశారు. రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్న ఆయన బోర్డులో సభ్యుడిగా చేరడానికి మాత్రం నిరాకరించారు. అతి పెద్ద షేర్ హోల్డర్ అయిన మస్క్ డైరెక్టర్‌గా చేరకపోవడంపై అందరిలోనూ చర్చకు దారి తీసింది. బోర్డులో చేరడం తనకు ఇష్టం లేదని మస్క్ చెప్పినట్టు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం మన చేతుల్లోనే ఉంటుందని ఉద్యోగులకు పరాగ్ చెప్పారు.
మరోవైపు ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్(Twitter) వెల్లకుండా అడ్డుకునేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. బలవంతంగా మస్క్ కొనుగోలు చేయకుండా ఉండేందుకు చివరి అస్త్రం పాయిజన్ పిల్ వ్యూహాన్ని బోర్డు తెరపైకి తెచ్చింది. పాయిజన్ పిల్ ప్రకారం కొత్త వ్యక్తులు 15 శాతానికి మించి సంస్థలో వాటా కొనుగోలు చేయకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా ఉన్న వాటాదారులే తక్కువ ధరకు షేర్లను కొనుగోలుచేసే అవకాశం లభిస్తుంది. పాయిజన్ పిల్ స్వీకరించిన తరువాత ట్విట్టర్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని కొత్త ఎత్తు వేశారు. సంస్థ తన సొంతమైతే డైరెక్టర్లు ఉండరని వారికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదని ఏటా 300 మిలియన్ డాలర్లు మిగులుతాయని తాజాగా ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌ను సొంతం చేసుకోవాలంటే ఎలాన్ మస్క్ రెండు పీహెచ్‌డీలు చేయాలేమోనని ఓ నెటిజన్ స్పందించారు. నెటిజన్ అలా అనడానికి కారణం ట్విట్టర్ బోర్డులో ఎక్కువగా పీహెచ్‌డీ, ఎంబీఏ చేసిన వారే అధికంగా ఉన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ ట్విటర్ బోర్డు డైరెక్టర్లు ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 4 కోట్ల 13 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఆశిస్తున్నారన్నారు. ఎలాన్ మస్క్ మినహా మిగతా 12 మంది షేర్ హోలర్లకు 77 వాటాలు కలిగి ఉన్నట్టు మరో నెటిజన్ స్పందించాడు.
ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా ఓ పోల్ సర్వే నిర్వహించారు. ప్రజాస్వామ్యం మనుగడకు వాక్ స్వాతంత్రం తప్పనిసరి అయితే ఈ విధానానికి ట్విటర్ కట్టుబడి ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ఓటింగ్‌లో 20 లక్షల 36వేల మంది పాల్గొన్నారు. ఇందులో 70.4 శాతం మంది ట్విటర్‌లో వాక్ స్వాతంత్రం లేదని ఓటేశారు. 29.6 శాతం మంది మాత్రం ఉందని సమాధానమిచ్చారు. అయినా ట్విటర్‌లో 9.2 శాతం షేర్లను కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా ట్విటర్ సంస్థనే కొనుగోలుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. మస్క్ డైరెక్టర్‌గా చేరకపోవడానికి కారణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్విటర్ డైరెక్టర్‌గా చేరితే సంస్థలో 15 శాతం కంటే ఎక్కువగా షేర్లను కొనుగోలు చేయరాదన్న నిబంధన ఉంది. ఒకవేళ ఆయన బోర్డులో మెంబరుగా చేరితే ట్విటర్‌ను పూర్తిగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఏదేమైనా ఇప్పుడు ఎలాన్ మస్క, ట్విటర్‌పై జోరుగా చర్చ సాగుతోంది. ఎలాగైనా ట్విట్టర్ పిట్టను సొంతం చేసుకోవాలనుకుంటున్న మస్క్‌కు అది దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.