మరోసారి కిమ్ విధ్వంసం : ప్రశ్నించిన అధికారిని కాల్చి చంపారు

త్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి విధ్వంసానికి పాల్పడ్డాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశ్నించిన తన ఐదుగురు అధికారులకు భయంకరమైన శిక్ష విధించాడు..

Update: 2020-09-12 09:29 GMT

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి విధ్వంసానికి పాల్పడ్డాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశ్నించిన తన ఐదుగురు అధికారులకు భయంకరమైన శిక్ష విధించాడు. నియంత ఆదేశాల మేరకు ఓ అధికారిని చంపేశారు. ఓ విందులో దేశ ఆర్థిక వ్యవహారాలపై చర్చిస్తున్న సమయంలో.. కిమ్ పాలన విధానాలపై ఐదుగురు అధికారులు చర్చ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒకతను కిమ్ నిర్ణయాలను ప్రశ్నించాడు.. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అవసరమని చర్చ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్ధిక కష్టాలను అధిగమించడానికి ఉత్తర కొరియా కూడా విదేశీ సహాయం కోరాలని లేవనెత్తారు. దీంతో కిమ్ జోంగ్-ఉన్ కు కోపం వచ్చింది.

పైగా కిమ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధిపతి కూడా కావడంతో అతని చేతగానితనం బయటపడినందుకు అధికారులపై తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. ఆ తరువాత తన అధికార యంత్రాంగంలో ముఖ్యమైన అధికారులను పిలిపించి, ఉత్తర కొరియా పాలనను బలహీనపరిచేందుకు వారు ప్రయత్నించారని సాకు చెప్పాడు. దాంతో అందులో ఒకతన్ని జూలై 30 న అతన్ని కాల్చి చంపారు. అంతేకాదు తన విధానాలను ప్రశ్నించినందుకు వీరందరి కుటుంబాలను యెడోక్‌లోని రాజకీయ శిబిరానికి పంపారు.  

Tags:    

Similar News