Iran-Israel: ఇరాన్ అణు బాంబును పరీక్షిస్తోందా? ఇరాన్-ఇజ్రాయెలో సంభవించిన భూకంపమే సాక్ష్యమా?

Iran-Israel: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరాన్ మరింత ఆజ్యం పోస్తుందా? అందులో భాగాంగానే తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5వ తేదీ శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపు ఒకే సమయంలో భూకంపం సంభవించడం ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 10.45 నిమిషాలకు ఇరాన్ లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన భూకంపం తీవ్రత 4.5గా నమోదు అయ్యింది.

Update: 2024-10-08 02:11 GMT

అక్కడికి 110కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయని అమెరిక భౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకు ఇజ్రాయెలో లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది భూకంపం కాదని..కచ్చితంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భూకంపం సంభశించింది కూడా అణు ప్లాంట్ కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నాయి. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగే ఉంటాయని అంటున్నారు.

ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ గత రాత్రి ఇరాన్ అణుబాంబు ప్రయోగించింది. సెమ్నాన్ సమీపంలో ఉపరితలం నుంచి 10కి.మీ కింద టెస్ట్ బాంబులను ప్రయోగించారు. దాని ఫలితంగానే 4.6 భూకంప తీవ్ర నమోదు అయ్యిందని పేర్కొన్నాడు. ఇరాన్ భూకంపం ఇజ్రాయెల్ ను భయపెట్టింది. ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తుందా లేదా. ఏ దేశము కూడా అణుశక్తితో చెలగాటం ఆడకూడదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

కాగా ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇరాన్ అణు సామర్ధ్యాలపై మరింత భయాన్ని పెంచింది. హిజ్బుల్లా, హమాస్ కు చెందిన ప్రధాన నాయకుల హత్యల తర్వాత ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్ లోకి దాదాపు 400 క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7, 2023న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుండి, ఇజ్రాయెల్ వైమానిక దాడులు 42,000 మంది పాలస్తీనియన్లను చంపాయి. గాజాతో పాటు, ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. 2,000 మందిని చంపింది. వేలాది మంది పారిపోయేలా చేసింది. పెరుగుతున్న మానవతా సంక్షోభం ఉన్నప్పటికీ, బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం, యునైటెడ్ స్టేట్స్ మద్దతుతో, దాని సైనిక చర్యలను తగ్గించే సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదు. త్వరలోనే ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేలా ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నెలకొన్నాయి. 

Tags:    

Similar News