కొత్త వేరియంట్స్‌ కలకలం.. డెల్టా సోకిన వ్యక్తికి.. ఒమిక్రాన్‌ సోకితే డెల్మిక్రాన్‌ రూపొందే ఛాన్స్‌

Corona New Variants Tension: జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి డెల్మిక్రాన్‌ లక్షణాలు...

Update: 2021-12-25 10:13 GMT

కొత్త వేరియంట్స్‌ కలకలం.. డెల్టా సోకిన వ్యక్తికి.. ఒమిక్రాన్‌ సోకితే డెల్మిక్రాన్‌ రూపొందే ఛాన్స్‌

Corona New Variants Tension: కొత్త వేరియంట్లతో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. యూరప్‌, యూఎస్‌ సహా పశ్చిమాదిన కొత్త వేరియంట్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వెరసి డెల్మిక్రాన్‌గా విలయం సృష్టిస్తోంది. డెల్టా బారిన పడిన వ్యక్తికి.. ఒమిక్రాన్‌ సోకితే డెల్మిక్రాన్‌ రూపొందుతున్నట్టు నిపుణులు స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పితో పాటు గొంతులో గరగర డెల్మిక్రాన్‌ లక్షణాలని వెల్లడించారు. డబుల్‌ వేరియంట్లు రూపొందడం అరుదంటున్న నిపుణులు.. భారత్‌లో డెల్మిక్రాన్‌ జాడ లేదని ప్రకటించారు.

Tags:    

Similar News