Delta Plus Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కల్లోలం

Delta Plus Variant: డెల్టా కేసులతో వణికిపోతున్న ఆఫ్రికా దేశాలు * ఇప్పటివరకు ఆఫ్రికాలోని 14 దేశాల్లో వ్యాప్తి

Update: 2021-06-26 09:01 GMT
Representational Image

Delta Plus Variant:  అటు ప్రపంచవ్యాప్తంగానూ కరోనా డెల్టా వేరియంట్‌ కల్లోలం రేపుతోంది. ఈ వేరియంట్‌ ఉద్ధృతితో ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు ఆఫ్రికాలోని 14 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండగా.. కాంగో, ఉగాండాలో మరింత తీవ్రంగా ప్రభావం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో ఓ కారు డ్రైవర్‌ ద్వారా పదుల సంఖ్యలో ప్రజలకు వైరస్‌ వ్యాపించింది. రెండు వారాల క్రితం ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి క్వారంటైన్‌కు తరలించిన కారు డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చింది. అతడి ద్వారా 65 మందికి వ్యాపించింది. ఒక్కసారిగా ఇన్ని కేసులు రావడం సిడ్నీని హడలెత్తించింది. దాంతో సిడ్నీ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని మరో నాలుగు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

ఏడాది కాలంగా ఒక్క కేసూ లేని ఫిజీలో ఇప్పుడు సామాజిక వ్యాప్తి నెలకొంది. ఇక టీకా పంపిణీలో ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయిల్‌నూ ఈ వేరియంట్‌ వణికిస్తోంది. గురువారం 227 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో.. ఇండోర్‌ ప్రదేశాల్లో మాస్క్‌ లు ధరించాల్సిన అవసరం లేదని పది రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. రష్యాలో డెల్టా ఉధృతితో ప్రస్తుతం రోజుకు 20 వేల కేసులు వస్తున్నాయి. ఆగస్టు చివరి నాటికి యూరప్‌ యూనియన్‌ దేశాల్లో నమోదయ్యే కేసుల్లో 90 శాతం పైగా డెల్టావే ఉంటాయని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ పేర్కొంది.

అయితే డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దానిపై టీకా ప్రభావం ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. డెల్టా వేరియంట్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో వేరుచేశామని.. దానిపై టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించారు. వారం పది రోజుల్లో ట్రయల్స్‌ ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రావాల్సి ఉందన్నారు.

Tags:    

Similar News