Russia War: భారీగా పెరిగిన ముడి చమరు ధరలు

Russia War: యుద్ధంతో నిలిచిపోనున్న చమురు సరఫరా

Update: 2022-02-24 06:45 GMT

భారీగా పెరిగిన ముడి చమరు ధరలు

Russia War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలవడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. 2014 తరువాత తొలిసారి బ్యారెల్‌ ధర 101 డాలర్లకు చేరింది. ఈ యుద్ధం తరువాత ముడి చమరు ధరలు 150 డాలర్లకు చేరుకునే ప్రమాదముందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు నిత్యావసరాల ధరలు కూడా కొండెక్కే అవకాశం ఉంది.

మరోవైపు ప్రపంచంలోనే చమురును సరఫరా చేస్తున్న అతి పెద్ద రెండో దేశం రష్యా. ఈ నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యుద్ధం తరువాత రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఆంక్షలు విధిస్తే.. రష్యాతో భారీ ఒప్పందాలు చేసుకున్న భారత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. తాజా పరిస్థితులపై భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. శాంతియుత చర్చల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని భద్రతా మండలిలో భారత్‌ కోరింది.

Tags:    

Similar News