Covid Vaccination: త్వరలో నోటి ద్వారా కోవిడ్ టీకా
* దక్షిణాఫ్రికాలో క్లినికల్ ప్రయోగాలు ప్రారంభం
Covid Vaccination: నోటి ద్వారా ఇచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. ఒరావ్యాక్స్ రూపొందించిన ఈ మందుపై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. వ్యాక్సినేషన్ల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి సౌతాఫ్రికా తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. అయితే భారత్‌లో చాలా మంది టీకాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజెక్షన్లకు తావులేని వల్ల వ్యాక్సినేషన్ సులువవుతుందని ఒరామెడ్ సీఈవో తెలిపారు.
కోవిడ్ టీకా పొందనివారు, ఆవ్యాధి బారినపడనివారిని తాజా క్లినికల్ ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు డోసుల్లో నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌కి మధ్య మూడు వారాల విరామం ఉంటుందని సమాచారం. ఇక కరోనా వైరస్‌లోని మూడు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఒరావ్యాక్స్ సంస్థ తెలియజేసింది. ఇక ఉత్పరివర్తనకు లోనుకాని ప్రొటీన్ కూడా ఇందులో ఉన్నట్లు తెలియజేసింది.