జపాన్ లో కరోనావైరస్ కేసులు నిలకడగా కొసాగుతున్నాయి.. గత 24 గంటల్లో 33 కొత్త కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఒక వ్యక్తి కూడా మరణించాడు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం 17 వేల 597 కేసులు నమోదయ్యాయి. 905 మంది మరణించారు.
టోక్యోలో ఆదివారం కొత్తగా ఐదుమందికి కరోనా సోకినట్లు గుర్తించారు. టోక్యోలో 10 కంటే తక్కువ కేసులు నమోదవడం వారంలో ఇదే మొదటిసారి. ఇక్కడ రికవరీ ప్లాన్ 2 వ దశలో నడుస్తోంది. దీని కింద పాఠశాలలు, వ్యాపారాలు తెరవబడుతున్నాయి.