Pakistan: పాకిస్థాన్‌లో కూలిన బ్రిడ్జి
Pakistan: వరద ఉధృతి పెరగడంతో.. కొట్టుకుపోయిన హసనాబాద్ వంతెన
Pakistan: సాధారణంగా భూకంపాలు వరదలు, లేదంటే నాణ్యతా లోపంతో బ్రిడ్జిలు కూలడం మనం చూసే ఉంటాం కానీ భానుడి భగభగలకు బ్రిడ్జి కూలడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఎండల తీవ్రతకు బండలు పగలడం చూశాం బ్రిడ్జి కూలడమేమిటని ఆశ్చర్యం కలుగుతుంది కదూ పాకిస్థానలోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఓ వంతెన కూలిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఎండల కారణంగా హిమాలయాల్లో మంచు భారీగా కరుగుతోంది.
దీంతో దిగువకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రవాహం ఉధృతి పెరిగి రెండ్రోజుల క్రితం పాకిస్థాన్‌లోని చారిత్రాత్మక హసనాబాద్ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల్లో వేలాది మంది పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన మంత్రి సోషల్ మీడియా షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.