చైనా విమాన ప్రమాదంలో కీలక మలుపులు.. విమానం కూలడానికి..
China Plane Crash: చైనాలో విమాన ప్రమాదం కీలక మలుపులు తిరుగుతోంది.
China Plane Crash: చైనాలో విమాన ప్రమాదం కీలక మలుపులు తిరుగుతోంది. 132 మందితో బయల్దేరిన ఈస్ట్రర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం నిట్టనిలువునా కూలిపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైలెట్‌కు ఆరోగ్యం బాగాలేని కారణంగా ప్రమాదం జరిగిందా? లేక సూసైడ్ మిషన్ హస్తం ఉందా? అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విమానంలోని బ్లాక్ బాక్స్ లభ్యమవడంతో దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
చైనాలోని విమాన ప్రమాద కల్లోలం కలకలం రేపుతోంది. ఈ విమానంలో 132 మంది ఉన్నప్పటికీ నాలుగు రోజులైనా ఒక్క మృతదేహం కూడా కనిపించకపోవడం సందేహాలకు తావిస్తోంది. పోలీసులు, సైన్యం, కార్మికులతో సహా 2వేల మంది గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మరోవైపు విమానం కూలిన ప్రాంతంలో ఉదయం భారీగా వర్షం కురియడంతో గాలింపును నిలిపేసింది. ఇక తాజాగా విమానం లోపలి బ్లాక్ బాక్స్ లభించింది. దీని ద్వారానే ప్రమాదంపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని చైనా పౌర విమానయాన సంస్థ తెలిపింది.
చైనాలోని కున్మింగ్ ఎయిర్‌పోర్టులో అన్ని రకాల తనికీలు పూర్తి చేసుకుని ఈ బోయింగ్ విమానం బయలుదేరింది. 29వేల 100 అడుగుల ఎత్తులో విమానం సాధారణంగానే ప్రయాణానించినట్టు ఫ్లైట్ రాడర్ 24 అనే సంస్థ తెలిపింది. సాధారణ వేగంతోనే విమానం వెళ్తున్నట్టు తెలిపింది. అలాంటి విమానం నిమిషం 35 సెకండ్ల వ్యవధిలోనే 29వేల అడుగుల కిందికి అంత వేగంగా పడిపోవడం నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే పైలెట్ అనారోగ్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్లైట్‌లో ముగ్గురు పైలెట్లు ఉండగా వారిలో ఇద్దరు అనుభవజ్ఞులని ఒకరు మాత్రమే టైనీ అని తెలిసింది. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నట్టు చైనా పౌరవిమానయాన సంస్థ తెలిపింది. లేదంటే ఉగ్రవాద చర్య ఏదైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు విమానం ఒక్కసారిగా తలకిందులుగా పడిపోవని విమానయాన నిపుణులు చెబుతున్నారు. బోయింగ్ విమానాలను తలకిందులుగా పడకుండా ప్రత్యేకంగా రూపొందించని విషయాన్ని నిపుణులు గుర్తి చేస్తున్నారు. ఒకవేళ విమానాన్ని సమాంతరంగా ఉంచే తోక భాగం ఉన్నట్టుండి కూలిపోతేనే ఇలా ఒక్కసారిగా కింది రాలిపోయినట్టుగా.. తలకిందులుగా కూలిపోయే అవకాశం ఉందంటున్నారు. కానీ ఈ విమానంలో అలాంటిది జరగలేదని స్పష్టమవుతోంది. దీంతో ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
విమాన శిథిలాల్లో దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను బీజింగ్ లేబరేటరికీ ఏవియేషన్ అధికారులు పంపారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఈ విమానం నేలకూలి ఉంటే.. ఆ విషయాన్ని ఈ బ్లాక్‌బాక్స్‌తో తెలిసిపోతుంది. కాక్‌పిట్‌లోని ప్రతి శబ్దాన్ని ఈ బ్లాక్ బాక్స్ రికార్డు చేస్తుంది. ఇక ఫ్లైట్ డేటా రికార్డర్ అయిన మరో బ్లాక్‌బాక్స్ ఇప్పటికీ దొరకలేదు. ఆ ప్రాంతాన్ని వేమంది కార్మికులు, వలంటీర్లు జల్లెడ పడుతున్నారు. వాతావరణం సహకరించకపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు ఈస్ట్రన్ విమానయాన సంస్థ తెలిపింది. అయితే మృతులు, ప్రమాదంపై చైనా అధికారులు ఇప్పటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
చైనాలో 2010 తరువాత పౌర విమానం కూలిపోవడం ఇదే తొలిసారి. మూడు దశాబ్దాల తరువాత చైనాలో జరిగిన అతి ఘోర ప్రమాదం ఇదే. 2010లో చైనాలోని యిచున్ ప్రాంతంలో విమానం కూలిన ఘటనలో 42 మంది మృతి చెందారు.