చైనాను వెంటాడుతున్న లాక్‌డౌన్‌ భయం

China: కోవిడ్‌ లక్షణాలున్న బాలుడు వచ్చాడని తెలిసి ... ఉన్నట్టుండి షాంఘైలో షాపింగ్‌మాల్‌ మూత

Update: 2022-08-17 03:23 GMT

చైనాను వెంటాడుతున్న లాక్‌డౌన్‌ భయం 

China: చైనా ప్రజలు దేనికి భయపడుతారు?.. ఇప్పుడైతే.. టక్కున్న చెప్పేయొచ్చు లాక్‌డౌన్‌.. అని.. మరి బీజింగ్‌ ప్రభుత్వం దేనికి భయపడుతుంది? అంటే.. కరోనా వైరస్‌.. తైవాన్‌ వివాదం కంటే.. డ్రాగన్‌ కంట్రీని ఎక్కువగా టెన్షన్‌ పెడుతున్నది మాత్రం కోవిడే.. ఎప్పుడు ఎక్కడ వైరస్‌ నమోదవుతుందోనని ప్రభుత్వం.. ఏ క్షణంలో ఎక్కడ లాక్‌డౌన్‌ విధిస్తారో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. చైనాలో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఆ లాక్‌డౌన్‌ ఎన్నాళ్లు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ కారణంగానే అక్కడి ప్రజలు కలవరపడుతున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో.. కోవిడ్‌ లక్షణాలున్న చిన్నారి.. ఓ షాపింగ్‌ మాల్‌లోకి వచ్చినట్టు తెలియగానే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాల్‌ను మూసేశారు. విషయం తెలుసుకున్న మాల్‌లో సిబ్బంది బలవంతంగా బయటకు వచ్చారు.

Tags:    

Similar News