China: ఇజ్రాయిల్‌ ఆత్మరక్షణ పరిధికి మించి దాడులు జరుపుతోంది

China: గాజా పౌరులపై ఇజ్రాయిల్ దాడులు ఆపేయాలి

Update: 2023-10-16 06:25 GMT

China: ఇజ్రాయిల్‌ ఆత్మరక్షణ పరిధికి మించి దాడులు జరుపుతోంది

China: గాజాపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ చర్యలపై చైనా స్పందించింది. ఇజ్రాయెల్‌ తమ ఆత్మ రక్షణ పరిధికి మించి దాడులు జరుపుతోందని ఆరోపించింది. గాజా పౌరులపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపేయాలని కోరింది. గాజా- ఇజ్రాయెల్‌ మధ్య శాంతి నెలకొనడమే తాము కోరుకుంటున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దాడులను ఆయన వ్యతిరేకించారు. గాజా పౌరులపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దాడులను నిలిపివేయాలని, శాంతియుతంగా చర్చిస్తేనే.. ఈ వివాదానికి సరైన పరిష్కారం లభిస్తుందని స్పష్టం వాంగ్ యీ స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ వివాదంపై సౌదీ అరేబియా మంత్రి ప్రిన్స్‌ బిన్‌ ఫర్హాద్‌తో చైనా నేతలు మాట్లాడిన అనంతరం వాంగ్‌ యీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిస్థితిని మరింత తీవ్ర తరం చేయకుండా.. వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరపాలని వాంగ్‌ యీ, సౌదీ అరేబియా నేతకు సూచించిన్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం చైనా రాయబారి ఇరాన్‌, సౌదీ అరేబియాల్లో పర్యటించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇజ్రాయెల్‌- హమాస్‌ వివాదంపై అమెరికా- చైనా విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరిపిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం మరింత విస్తరించకుండా నిరోధించేందుకు చైనా సహకారాన్ని అమెరికా కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..పాలస్తీనాకు స్వతంత్రం కల్పించినప్పుడే ఈ పరిస్థితి మారుతుందని చైనా హమాస్‌ దాడులకు మద్దతుగా మాట్లాడింది.

Tags:    

Similar News