కరోనాను జయించిన కెనడా పీఎం భార్య

Update: 2020-03-30 05:58 GMT
Justin Trudeau, Sophie

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కరోనాను జయించింది. 16 రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆమె కొవిడ్ మహమ్మారిపై విజయం సాధించింది. గ్రెగొరీ కోలుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 12 న లంచన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. ఇదే విషయాన్ని గ్రెగొరీ కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News