Bernard Arnault: ప్రపంచానికి కొత్త కుబేరుడు
Bernard Arnault: ప్రపంచంలో కొత్త కుబేరుడు అవతరించాడు.
Bernard Arnault: ప్రపంచంలో కొత్త కుబేరుడు అవతరించాడు. ఇప్పటివరకు ప్రపంచ నెంబర్‌వన్‌గా కొనసాగుతోన్న అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 186.4 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ నెంబర్‌వన్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నారు. భారతీయ కరెన్సీలో ఇది 13లక్షల 57వేల 737కోట్ల పైమాటే. లగ్జరీ గూడ్స్ విక్రయించే బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 765 మిలియన్ డాలర్లు పెరగడంతో అతని ఆస్తులు అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్‌ను మించిపోయాయి. ఇక, రెండో స్థానంలో నిలిచిన జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 147 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మూడో స్థానంలో నిలిచారు.