Beer Bottle Free: వ్యాక్సిన్ వేసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్
Beer Bottle Free: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు.
Beer Bottle Free: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టీకా తీసుకోవాలంటూ యువతను బలవంతపెట్టకుండా వారంతంట వారే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేసింది. యువతను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మార్గలను అన్వేషిస్తూ అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్‌ను అందించాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇది మన రాష్ట్రంలోనో లేక మన దేశంలోనో అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కొవిడ్ టీకా తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది యూఎస్.
అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్ యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. కొవిడ్ టీకా తీసుకున్న యువతకు ఉచితంగా బీరు బాటిల్ ఇవ్వాలని నిర్ణయించింది.