Muhammad Yunus : బంగ్లా సారధి మహమ్మద్ యూనస్ ఎవరు?అల్లకల్లోల దేశాన్ని గాడిలో పెట్టగలరా?

Muhammad Yunus : బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. ఢాకాలోని అవామీ లీగ్ పార్టీ నేతలను అల్లరిమూకలు టార్గెట్ చేస్తున్నారు. షేక్ హసీనాకు సన్నిహితులైన వ్యక్తులను సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారు.

Update: 2024-08-06 06:18 GMT

Muhammad Yunus : బంగ్లా సారధి మహమ్మద్ యూనస్ ఎవరు?అల్లకల్లోల దేశాన్ని గాడిలో పెట్టగలరా? ఆయన ముందున్న సవాల్ ఇవే

Muhammad Yunus :బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత, అంతర్గత ప్రధానమంత్రి రేసు తీవ్రమైంది. ఈ రేసులో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ పేరు ముందంజలో ఉంది. మహ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా చేయాలని విద్యార్థి ఉద్యమ చీఫ్ నహీద్ ఇస్లాం ప్రతిపాదించారు. దేశ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన సమ్మతి తెలిపారు. అదే సమయంలో తాత్కాలిక ప్రధాని రేసులో ఖలీద్ జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ కూడా ఉన్నట్లు సమాచారం. సీనియర్ న్యాయవాది సారా హుస్సేన్, రిటైర్డ్ త్రీ స్టార్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి, బంగ్లాదేశ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సలేహుద్దీన్ అహ్మద్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరీ మహ్మద్ యూనస్?

మొహమ్మద్ యూనస్ జూన్ 28, 1940 న జన్మించారు. యూనస్ బంగ్లాదేశ్ లో ఒక సామాజిక వ్యవస్థాపకుడు, బ్యాంకర్, ఆర్థికవేత్త, సామాజిక నాయకుడు. పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేసినందుకు యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. యూనస్ పేదరిక నిర్మూలనలో చేసిన ముఖ్యమైన కృషికి గాను ఈ అవార్డును అందుకున్నారు. యూనస్ 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించారు. ఇది పేద ప్రజలకు చిన్న రుణాలను అందిస్తుంది. బంగ్లాదేశ్ తన గ్రామీణ బ్యాంక్ ద్వారా మైక్రోక్రెడిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

దీని కారణంగా, బంగ్లాదేశ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు జీవన ప్రమాణాలను పెంచడంలో విజయం సాధించారు.2009లో, అతనికి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం లభించింది. 2010లో అతనికి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ లభించింది. దీనితో పాటు మరెన్నో అవార్డులు కూడా అందుకున్నారు. 2011లో యూనస్ సోషల్ బిజినెస్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ అనే సంస్థ స్థాపించారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. వాండరర్ బిల్ట్ యూనివర్సిటీలో చదువుకునేందుకు పుల్ బ్రైట్ స్కాలర్ షిప్ ను కూడా పొందారు. విద్యాభ్యాసం ముగిసిన అంతరం మిడిల్ టేన్నెస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. చిట్టాగాంగ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ హెడ్ గా బాధ్యతలను నిర్వర్తించారు.

షేక్ హసీనా గరుడ కమాండోల రక్షణ:

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపు తప్పిన తరువాత, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌ను వదిలి భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో గరుడ్ కమాండోల రక్షణలో ఉన్నారు. షేక్ హసీన్ రాజీనామా తర్వాత, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ప్రస్తుత పార్లమెంటును రద్దు చేశారు. అలాగే, బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్మీ చీఫ్‌తో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్రపతి ప్రకటించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేస్తామని రాష్ట్రపతి తెలిపారు.

ఇంకా కొనసాగుతున్న.. హింస, కాల్పులు

బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ హింస కొనసాగుతోంది. ఢాకాలోని అవామీ లీగ్ పార్టీ నేతలను అల్లరిమూకలు టార్గెట్ చేస్తున్నారు. వారి ఇళ్లు, వాహనాలను తగులబెడుతున్నారు. షేక్ హసీనాకు సన్నిహితులైన వ్యక్తులను సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారు. అల్లర్లు బంగ్లాదేశ్‌ జాతిపిత ముజిబుర్‌ రెహమాన్‌ విగ్రహాన్ని సుత్తి, బుల్‌డోజర్‌లతో కూల్చివేశారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత, సైన్యం ఖచ్చితంగా కమాండ్ తీసుకుంది. నేటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు-కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులను తెరవాలని ఆర్మీ ఆదేశించింది. దేశం మొత్తం కర్ఫ్యూ ఎత్తివేయాలని సైన్యం ఆదేశించింది. అయితే మొత్తం బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

Tags:    

Similar News