North Korea - America: నార్త్ కొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా ఆందోళన

North Korea - America: శాంతి స్థాపనకు విఘాతమన్న అమెరికా ప్రతినిధి సంగ్ కిమ్

Update: 2021-10-25 03:50 GMT

North Korea - America: నార్త్ కొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా ఆందోళన

North Korea - America: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన జలంతర్గామి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేసింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు నార్త్ కొరియా చర్యలు విఘాతంగా మారుతున్నాయని ఆ దేశంలోని అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్‌ కిమ్‌ పేర్కొన్నారు. ఈ తరహా రెచ్చగొట్టే కార్యకలాపాలను నిలిపేయాలని, తమతో చర్చల్లో పాల్గొనాలని ఉత్తర కొరియాకు పిలుపునిచ్చారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.

Tags:    

Similar News