Russia-Ukraine War: రష్యాలోని భారీ భవనంపై డ్రోన్‌తో దాడి
Russia-Ukraine war: 9/11 తరహాలో రష్యాలోని భారీ భవనంపై అటాక్
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికాలోని ట్విటన్ టవర్‌ను ఉగ్రవాదులు కూల్చిన మాదిరి.... రష్యాలోని సరాటోవ్ నగరంలో భారీ భవనంపై డ్రోన్‌తో దాడి చేశారు. ఉక్రెయిన్ మిలిటరీ చర్యగా రష్యా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రతిగా ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్లతో విరుచుకుపడుతోంది. రష్యా దాడిలో ముగ్గురు మృతి చెందగా మరికొందరికి గాయాలు అయ్యాయి.
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పౌరులు టార్గెట్‌గా కొనసాగింది. భీకర యుద్ధం తర్వాత కొన్ని రోజుల పాటు అడపాదడపా చర్యలు ఇరువైపుల నుంచి జరిగాయి. కొన్ని రోజులుగా నిషబ్ధంగా ఉన్న ఇరుదేశాల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి మిస్సైల్, డ్రోన్లతో రష్యా విరుచకు పడుతుంది. మరోవైపు రష్యా మిస్సైల్, డ్రోన్లను గాల్లోనే నేలకరిపిస్తున్నాయి ఉక్రెయిన్ దళాలు.