వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ప్రతి 10 మందిలో 9 మంది మరణం.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ప్రతి 10 మందిలో 9 మంది మరణం.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
Air Pollution: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నివేదిక ప్రకారం ప్రతి 10 మందిలో 9 మంది కలుషితమైన గాలిని పీల్చుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలో కాలుష్యం కారణంగా 38 లక్షల మంది చనిపోతున్నారు. వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది అకాల మరణాలకు గురవుతున్నారని WHO నివేదిక చెబుతోంది. ఈ మరణాలలో 91 శాతం వరకు ఆర్థిక పరిస్థితి బాగా లేని దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ఈ దేశాల్లో చాలా వరకు ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి.
కలుషితమైన గాలిలో పీఎం 2.5 కణాలు శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి చేరుతున్నాయని నివేదిక పేర్కొంది. అవి ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు చేరి హాని కలిగిస్తాయి. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల 70 వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది. వీరు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు పది లక్షల మంది పిల్లలు న్యుమోనియాతో మరణిస్తున్నారు.
వాయు కాలుష్యం పిల్లలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తోందని ఇది భవిష్యత్తులో వారికి అనేక సమస్యలను కలిగిస్తుందని WHO చెబుతోంది. వీటిలో మెదడు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోవడం, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు ఉంటున్నాయి. కలుషిత గాలి పెరగడం వల్ల పిల్లల్లో ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.
కట్టెలు, కర్రలు కాల్చి వంట చేయడం, స్టవ్‌లు కాల్చడం, కిరోసిన్ ఉపయోగించడం వల్ల ఇళ్లలో కాలుష్య స్థాయి పెరుగుతోంది. ప్రపంచంలోని 2400 మిలియన్ల మంది ప్రజలు ఇండోర్ పొల్యూషన్‌తో పోరాడుతున్నారు. చలికాలంలో మెట్రో నగరాలలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.