వైద్య రంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు వైద్యులకు 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం లభించింది. వారిలో ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్త ఉన్నారు. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ అవార్డు కమిటీ సోమవారం ఎంపిక చేసింది. వీరు భయంకరమైన హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ అందుకే వారిని ఈ అవార్డు వరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా హెపటైటిస్ కేసులు అలాగే ప్రతి సంవత్సరం 400,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇది దీర్ఘకాలికమైనదిగాను.. కాలేయంలో మంటగాను ఉంది.. క్యాన్సర్‌కు ప్రధాన కారణంగాను ఉంది. కాగా ఈ హైపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది.