నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాల్ బాంకే జిల్లాలోని తురియా అటవీ ప్రాంత సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది వలస కార్మికులు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా నుంచి నేపాల్ సాలియన్ జిల్లాకు వెళ్లే మార్గంలో నేపాలీ వలస కార్మికులను తీసుకెళ్తున్న వాహనం అర్ధరాత్రి సమయంలో బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే మరణించారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని నేపాల్‌గంజ్ నగరంలోని భేరి ఆసుపత్రికి తరలించినట్టు బ్యాంకే జిల్లా అధికారి రాంబహాదూర్ కురుంగ్వాంగ్ ఫోన్ ద్వారా ANI కి చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే బ్యాంకే జిల్లా పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ హ్రిదేయేష్ సప్కోటా భావిస్తున్నారు.