Skin Care: ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉండటానికి ప్రతిరోజు స్నానం చేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్లినప్పుడు దుమ్ము, ధూళితో పాటు పొల్యూషన్ చర్మాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు శరీరం మొత్తం మురికిగా తయారవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు. అంతేకాకుండా స్నానం అనేది రిలాక్స్ అందిస్తుంది. మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా ఈ పదార్థాలను కలపితే చర్మం తళ తళ మెరిసిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
1. బేకింగ్ సోడా
మీరు స్నానం చేసినప్పుడు నీటిలో 5 టీస్పూన్ల బేకింగ్ సోడా వేయండి. ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేస్తే శరీరంలోని విషపూరితమైన అంశాలు బయటకు వచ్చి వ్యాధులు రాకుండా ఉంటుంది. అంతేకాదు చర్మం మంచి రంగు తేలుతుంది.
2. గ్రీన్ టీ
మెరిసే చర్మం కోసం స్నానం చేసే నీటిలో 4 నుంచి 5 గ్రీన్-టీ బ్యాగులను ఉంచాలి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, డిటాక్సిఫైయర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అవి చర్మానికి యాంటీ ఏజింగ్, క్లెన్సర్‌గా పనిచేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. వేప ఆకులు
ఎప్పుడు తలస్నానం చేసినా 8 నుంచి 10 వేప ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో మరిగించి వడగట్టాలి. ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
4. పటిక
స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు, పటిక కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల అలసట పోతుంది. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో పాటు కండరాలు రిలాక్స్ అవుతాయి. మంచి ఉపశమనం దొరుకుతుంది.