మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ అంచనాలు మారితే చెప్పలేం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా అంతే .కొద్దిరోజుల క్రితం 2019ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తోందనే అంశంపై నేషనల్ మీడియా రిపబ్లికన్ టీవీ సీ- ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జగన్ గెలవడం ఖాయమని ఘంటా పధంగా చెప్పుకొచ్చుంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏపీలో ఉన్న25 ఎంపీ సీట్లలో 13 సీట్లను వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ తో పొత్తు ఉంటే టీడీపీకి 12 సీట్లు అవకాశం ఉంది. లేదంటే అన్ని సీట్లు దక్కడం కూడా కష్టమేనని సూచించింది.
రాష్ట్రంలో వైసీపీ అధికారం దిశగా అడుగులు వేస్తూ ఒక్కో ఎంపీ సీటు కనీసం ఏడు అసెంబ్లీ స్థానాల, అంతకు మించి కూడా ప్రభావాన్ని చూపుతాయంట. ఇక కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్ల విషయంలో వైసీపీ హవా ఉంటుందని ...అదే అంశం ఎమ్మెల్యే సీట్ల విషయంలో సానుకూలత చూపించనుంది. కానీ జగన్ మాత్రం సీ - ఓటర్ సర్వేని నమ్మరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు నాటి ఎన్నికల ఫలితాలపై నేషనల్ మీడియా, తెలుగు మీడియా కొన్ని సర్వేలు చేసింది. ఆ సర్వేల్లో కూడా వైసీపీ గెలుస్తుందనే ఫలితాలు వచ్చాయి. కానీ తీరా ఫలితాలు తారమారయ్యాయి. స్వల్ఫ ఓట్ల తేడాతో జగన్ ఓటమి పాలయ్యారు. ఈ సర్వేని పట్టించుకోని జగన్ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తున్నారు. తన పాదాలు బొబ్బలను కూడా మరిచిపోయి మరింత ఉత్సాహంగా ముందుకు నడస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.