Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మనోజ్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Manchu Manoj: మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతి (Tirupati) లోని మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది.

Update: 2025-01-15 12:45 GMT

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మనోజ్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు యూనివర్సిటీ లోపల ఉండగా.. మంచు మనోజ్ దంపతులు యూనివర్సిటీలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు అడ్డుకున్నారు.

మంచు కుటుంబం మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో మంచు మనోజ్ యూనివర్సిటీలోకి వస్తే సమస్యలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో సెక్యూరిటీ సిబ్బంది మనోజ్‌ను అనుమతించలేదు. తాను గొడవ కోసం రాలేదని.. యూనివర్సిటీ ఆవరణలో తన తాత నారాయణ స్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని మనోజ్ చెప్పినప్పటికీ సెక్యరిటీ సిబ్బంది అనుమతించలేదు.దీంతో మనోజ్ గేటు వద్ద ఆందోళకు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లు వివాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. పోలీసుల సూచన మేరకు మనోజ్ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఉదయం మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీలో చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సూచనతో వెనుదిగిరిన మనోజ్ నేరుగా నారావారిపల్లె వెళ్లారు. భార్య మౌనికతో కలిసి లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అనంతరం ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో మంచు మనోజ్ దంపతులు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా మరోసారి మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చారు. దీంతో మనోజ్ దంపతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను మనోజ్‌కు అందజేశారు. అయినా మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. గతకొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News