ఏపీకి ప్రత్యేకహోదాపై ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న భారీ ఎత్తున వైసీసీ పార్టీ నేతలు వంచనపై గర్జన దీక్షను చేపట్టనుంది. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపర్చడంలో ప్రభుత్వాలతీరును నిలదీస్తూ వైసీపీ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈనెల27 ఉదయం పది గంటలకు నుంచి సాయంత్రం 4 గంటలవరకు వంచనపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎంపీలు, పార్టీనేతలు, రాజ్యసభ సభ్యులు పాల్గోననున్నారు. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ పోరాడుతున్న విషయం తెలిసిందే కాగా దానిలో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.