వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ తో ఎంపీలు భేటీ అయ్యారు. రాజీనామాలు ఆమోదించాంటూ ఎంపీలు పట్టుబట్టటంతో స్పీకర్ రాజీనామాలను ఆమోదించారు. సమావేశం తర్వాత లోక్ సభ ఉన్నతాధికారులతో సమావేశమైన స్పీకర్ తర్వాత ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఐదుగురు ఎంపీలకు సమాచారం అందించినట్లు సమాచారం. మొత్తానికి వైసీపీ ఎంపిలు పట్టుబట్టి తమ రాజీనామాలను స్పీకర్ దగ్గర ఆమోదింపచేసుకున్నారు. ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ ను ఈరోజు సాయంత్రం పార్లమెంటు ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. రాజీనామాలు చేసిన దాదాపు రెండు నెలల తర్వాత తమ డిమాండ్ ప్రకారం స్పీకర్ రాజీనామాలను ఆమోదించటం గమనార్హం.