లోకేశ్‌ ట్విట్టర్‌ నాయుడులా వ్యవహరిస్తున్నారు

Update: 2018-06-18 11:37 GMT

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. అవగాహన లేకుండా నియోజకవర్గాల అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఇవ్వాలని 36 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామంటూ ట్విట్టర్‌లో చెప్పిన లోకేశ్‌ను...ట్విట్టర్‌ నాయుడుగా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గ నిధులపై మంత్రి లోకేశ్‌ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామని ట్విటర్‌లో చెప్పి ట్విటర్‌ నాయుడుగా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారన్నారు. ట్విటర్‌లో కాకుండా అమరావతి చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కార్‌ ఫండ్స్‌ను ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నియోజకవర్గ నిధులను దొడ్డి దారిన మళ్లిస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయనిధిలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
 

Similar News