వైసీపీకి మరో షాక్ తగలనుందా? కోస్తా నుంచి ఓ యువ నాయకుడు టీడీపీలోకి జంప్ కాబోతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ సమీకరణలు. కాకినాడ వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా ఉన్న చలమలశెట్టి సునీల్‌కు టీడీపీ నేతలు గాలం వేశారన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న సునీల్‌కు రాజ్యసభ మూడో అభ్యర్థిగా స్థానం ఖరారు చేశారన్న ప్రచారం ఉంది. సునీల్ పార్టీ మార్పుపై అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.