పథకం ప్రకారమే హత్యాయత్నం : వైసీపీ

Update: 2018-10-31 02:27 GMT

అక్టోబర్ 25 న విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కత్తిపోటు దాడిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే థర్డ్‌పార్టీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బొత్స  నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ విషయాన్నీ రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్తామంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సైతం కలుస్తామన్నారు బొత్స సత్యనారాయణ..

తమ అధినేతపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని, ఈ ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని మాజీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు మాజీ ఎంపీ వరప్రసాద్. 

ఇదిలావుంటే ఏపీ బీజేపీ నేతలు సైతం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిశారు. ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చాలని.. దీనిద్వారా తమ  ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అయనకు చెప్పినట్టు సమాచారం. దీనిపై రెండు నెలల కిందటే ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నటుడు శివాజీని భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని విచారణ జరిపించాలని వారు కోరారు. 

Similar News