వైసీపీ అధినేత వైయస్ జగన్ తన పాదయాత్రలో అనూహ్య హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.ఇప్పటికే పలు జనాకర్షణ హామీలు ఇచ్చిన జగన్ 20 రోజుల క్రితం తమ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు దివంగత ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. జగన్ తాజాగా (శుక్రవారం) పశ్చిమగోదావరిజిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెడతానని హామీ ఇచ్చారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు బహిరంగసభలో పాల్గొన్న జగన్ తన వద్దకు రాజుల కులస్థులు వచ్చి మీరు అధికారంలోకి రాగానే పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని కోరారు.. వారి కోరిక సబబేనని తప్పకుండ ఆ పని చేసి తీరుతానని స్పష్టం చేశారు జగన్. కాగా శనివారం జగన్ పాదయాత్ర ఆకివీడు శివారు నుంచి ప్రారంభం కానుంది.