నూతన ఏడాది తొలి రోజు కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చిత్తూరుజిల్లా తంబళ్లపల్లిలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షుడికి తమ కష్టనష్టాలు చెప్పుకుంటున్నారు. ఔత్సాహికులు జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. టీటీడీ అర్చకుల సమక్షంలో వేంకటేశ్వరస్వామికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. నేటి పాదయాత్ర కడప క్రాస్‌రోడ్డు, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్ రోడ్స్ మీదగా సీటీఎం వరకు కొనసాగనుంది.