మిస్సింగ్‌ యూ.. పాప : వైయస్ జగన్

Update: 2018-08-26 05:58 GMT

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరికీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండటంతో ఈసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.'మిస్సింగ్‌ యూ ఆన్‌ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్‌ ఆల్వేస్‌' అంటూ పేర్కొన్నారు. కాగా రాఖి సందర్బంగా జగన్ కు  ఎమ్మెల్యే రోజా పలువురు మహిళలు రాఖి కట్టారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మహిళలకు రక్షణ ఉంటుందని రోజా అభిప్రాయపడ్డారు.
 

Similar News