వైసీపీ సీనియర్ నేత మృతి.. హుటాహుటిన హైదరాబాద్ కు జగన్!

Update: 2018-05-20 03:17 GMT

వైసీపీలో విషాదం నెలకొంది ఆ పార్టీ సీనియర్ నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ డిఎ. సోమయాజులు మృతిచెందారు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో పాదయాత్రలో ఉన్న వైయస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోమయాజులు కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. కాగా  గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. వైయస్ మరణాంతరం వైసీపీ చేరిన ఆయన ఆ పార్టీలో ముఖ్యనేతగా, జగన్ కు సలహాదారులుగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల పలువురు వైసీపీనేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పెద్దదిక్కు కోల్పోయామని అభిప్రాయపడుతున్నారు. 

Similar News