పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదేనేమో..! ఓ యువతి భూమిపైన స్వచ్ఛమైన ప్రేమదొరకలేదని 300ఏళ్ల క్రితం చనిపోయిన ఆత్మను పెళ్లి చేసుకుంది. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన అమాండా కు భూమిపైన నివసించేవారి దగ్గర స్వచ్ఛమైన ప్రేమదొరకలేదు . దీంతో జాక్ అనే సముద్రపు దొంగ 300ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆ జాక్ ను 12మంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇది మనకు వింతగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ చట్టాల ప్రకారం ఈ పెళ్లి చట్టబద్దమే. అలా వీరిద్దరు ఒక్కటయ్యారు.
అమాండా భర్త చనిపోయాడు. అప్పటికే ఐదురుగు పిల్లలున్నారు. కానీ తనని ప్రేమగా చూసుకునేవారు ఎవరు లేరు. దీంతో దిగులు పడ్డ ఆలోచనలో పడింది. ఎలాగైన తనని ప్రేమించే వారిని మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా జీవించాలని . అలా అన్వేషణ ప్రారంభించిన ఆ మహిళ చనిపోయిన జాక్ ను ఇష్టపడింది. అంతే జాక్ పుర్రె , ఎముక గుర్తు ఉన్న జెండాతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమాండా భౌతికంగా లేని జాక్ ఓ కొవ్వొత్తికి ఉంగరాన్ని తొడిగి అమాండ సంతృప్తిపడింది. 2014లో ఓ రోజు రాత్రి వాళ్లిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని, జాక్ ఎప్పుడూ తన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుందని అమాండ చెబుతోంది. భర్తమరణం కలిచివస్తే జాక్ రూపంలో తనకు స్వచ్ఛమైన ప్రేమ లభించిందని అమాండా అంటోంది.