భర్తకు భార్య చిత్రహింసలు.... 6 నెలలుగా కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో బంధించిన భార్య
భార్యలను భర్తలు హింసించడం కామన్. మరి.. భార్యలే.. భర్తలను హింసిస్తే.. అందుకే ఇది వార్తయ్యింది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో.. ఓ భార్య.. భర్తకు బతికుండగానే నరకం చూపించింది. ఆరు నెలలుగా.. ఇంట్లో కాళ్లు, చేతులు కట్టేసి.. చిత్రహింసలకు గురిచేసింది.
సఖినేటిపల్లికి చెందిన కొక్కిరిగడ్డ సత్యనారాయణకు కొమరగిరిపట్నానికి చెందిన సూర్యకుమారికి 15 ఏళ్ల క్రితం
వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన కొన్నాళ్లకు గల్ఫ్ వెళ్లిన సత్యనారాయణ.. బాగా డబ్బులు సంపాదించి.. అత్తగారి ఊరు కొమరగిరిపట్నానికి మకాం మార్చాడు. ఇళ్లు నిర్మించుకొని కుటుంబంతో నివాసమంటున్నాడు. కొన్నాళ్లుగా.. సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. దీంతో.. భార్య,భర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతూ ఉండేవి. భర్తతో వేగలేక.. విసిగిపోయిన భార్య.. 6 నెలలుగా ఇంట్లోనే తాళ్లతో కట్టేసి నిర్బంధించింది. కొంతకాలంగా సత్యనారాయణ ఫోన్ ఎత్తకపోవడంతో.. అతని తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు సీన్‌లోకి ఎంటరవడంతో.. అసలు విషయం బయటపడింది.