నా భర్తను చంపిన వారికీ అదేగతి..

Update: 2018-12-04 14:55 GMT

తన భర్తను చంపిన వారికీ అదే గతిపడితేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని యూపీలోని బులంద్‌షహర్‌లో సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ భార్య అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో గోవధ జరిగినట్లు వార్తలు రావడంతో. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సయనలోని ఓ గ్రామం నుంచి ఓ వ్యానులో ఆవులను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో గో సంరక్షకలు ధర్నాకు దిగారు. రోడ్లపై వాహనాలు తిరగకుండా ఆంక్షలు పెట్టారు. 

దీంతో పోలీసులకు, గోసంరక్షకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రెచ్చిపోయిన అల్లరి మూకలు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాయి. దాంతో విధి నిర్వహణలో ఉన్న సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు పాల్పడ్డారని అనుమానిస్తున్న ఐదుగురు నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్రాణాలు కోల్పోయినసుబోధ్‌ కుమార్‌ సింగ్‌ కుటుంబానికి 40 లక్షలు అలాగే వారి తల్లిదండ్రుల కోసం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్. అంతేకాదు కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.  


 

Similar News