మరోసారి జీఎస్టీ సిద్ధమైంది. శృంగార మియా మాల్కోవా అందాలను, మ్యూజిక్ డైరక్టర్ ఎం. ఎం కీరవాణి మ్యూజిక్ ను వినొచ్చంటూ ఆర్జీవి ట్వీట్ చేశాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). ఈ షార్ట్ ఫిల్మిం ను డైరక్టర్ ఆర్జీవీ శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశాడు. అయితే ఈ ఫిల్మిం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న లక్షలాదిమంది అభిమానులు వీడియోను ఒకే సమయంలో క్లిక్ చేయడంతో అది కాస్తా క్రాష్ అయింది. దీంతో వీడియో ప్లే కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
అయితే ఒకే సారి లక్షలాది మంది అభిమానులు క్లిక్ చేయడంతో ఈ సమస్య తలెత్తిందని, ఆ సమస్యను సరిదిద్దే పనిలో ఉన్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని కోరాడు.