మధ్యప్రదేశ్‌లో 65.5 , మిజోరంలో 73 శాతం పోలింగ్..

Update: 2018-11-28 14:55 GMT

మధ్యప్రదేశ్‌, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మిజోరంలో 73 శాతం, మధ్యప్రదేశ్‌లో 65.5 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 230 స్దానాలున్న మధ్యప్రదేశ్‌లో మొత్తం 2899 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా 1094 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీచేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాలుగోసారి తిరిగి అధికారం చేపడుతుందని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇటు మిజోరంలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగిసినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమయం ముగియడంతో కొన్ని చోట్ల క్యూలో నిలబడిన ఓటర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి లాల్‌ తన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 81 శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అశిష్‌ కుంద్రా తెలిపారు.

Similar News