వొడాఫోన్, రిలయన్స్ జియోపై టెలికం విభాగానికి ఫిర్యాదు చేసింది. అపరిమిత కాల్స్‌తో వస్తున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ వల్ల తమ కంపెనీకి నష్టం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. జియో ఉచితంగా ఇవ్వనున్న ఈ ఫోన్ వల్ల ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన తాము మరిన్ని కష్టాల్లో పడిపోయే అవకాశం ఉందని టెలికం కమిషన్ మెంబర్ అనురాధ మిశ్రాకు లేఖ రాసింది.
అయితే ముందుగా ప్రకటించిన విధంగా రిలయన్స్ జియో నిన్న ఈ ఫోన్‌ను బీటా టెస్టింగ్ కోసం విడుదల చేసింది. ఈనెల 24 నుంచి బుకింగ్స్ మెుదలుకానున్నాయి. వచ్చేనెల మెుదటి వారంలో ఫోన్ వినియోగదారులకు చేరనుంది. అయితే డెలివరీ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.