Gold Rate Today: న్యూఇయర్ వేళ పసిడి ప్రియులకు శుభవార్త..ఒకటో తేదీన దిగివచ్చిన బంగారం ధర..తలం ఎంత ఉందంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడలో బంగారం రేట్లు భారీగా తగ్గాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందటి రోజుతో పోలిస్తే.. మళ్లీ పెరగడం గమనార్హం. ప్రస్తుతం 2025 జనవరి 1న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ.. కొన్ని రోజులు స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు కొత్త సంవత్సరం రోజు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగినా.. దేశీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజు పెరగ్గా.. ఇవాళ మళ్లీ తగ్గాయి.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పతనమైంది. కాగా తులం బంగారం ధర 71,100 వద్ద ఉంది. దీని కంటే ముందు రోజు ఇది 150 రూపాయల చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజు 440 తగ్గి 10 గ్రాములకు ప్రస్తుతం 77,560 వద్ద కొనసాగుతోంది. నిన్నటి రోజు ఇక్కడ 160 రూపాయలు పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి.
అటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ బంగారం ధర 22 క్యారెట్లపై 400 రూపాయలు తగ్గింది. 10 గ్రాములు 71,250 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు తగ్గి తులానికి 77,710 ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ కంటే ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. స్థానిక పన్ను రేటు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయని చెప్పవచ్చు.
ఇక బంగారం ధరలతో పాటే వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా 1900 రూపాయలు తగ్గిన కిలో వెండి రేటు 90,500 పలుకుతుంది. అంతకు ముందు రెండు రోజుల క్రితం ఈ ధర స్థిరంగానే ఉంది. ఇక ఢిల్లీ కంటే హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ కిలో 1900 రూపాయలు పడిపోయి ప్రస్తుతం 98000 వద్ద కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రింద కిలో వెండి లక్ష రూపాయలకు పైగానే ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి పదివేలకు దిగివచ్చింది