సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంకోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రైతుసమస్యల అధ్యయనం కోసం లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్త పర్యటన సాగిస్తున్నారు. అయితే గతకొంతకాలంగా అయన టీడీపీలో చేరతారని.. లేదు లేదు జనసేనలో చేరతారని రూమర్లు హల్చల్ చేస్తున్నాయి.తాజాగా అయన బీజేపీలో చేరడానికి దాదాపు నిర్ణయించుకున్నారని రేపో మాపో సమయం చూసుకుని కమలం గూటికి చేరతారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది. ఇక ఈ వార్తలపై స్వయంగా లక్ష్మీనారాయణ స్పందించారు. తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తాను ప్రజల పక్షమే తప్ప పాలకుల పక్షం కాదని అన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.