విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) మృతి చెందారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికైన విద్య.. ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు (గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. 1950లో చెన్నుపాటి శేషగిరిరావును ఆమె వివాహం చేసుకున్నారు. 1980లో తొలిసారి విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో రెండోసారి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.