భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. రేపు వేకూవజామున ప్రారంభకానున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే లక్ష మంది భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. పెథాయ్ తుపాన్ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలికి దుప్పట్లను కూడా టీటీడీ పంపిణీ చేస్తోంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనార్థం పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. రేపు వేకూవజామున ప్రారంభకానున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే లక్ష మంది భక్తులు కొండపైన వివిధ ప్రాంతాల్లో వేచిఉన్నారు అయితే సామన్యభక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లను టీటీడీ చేసింది చలిగాలులు తెలీయకుండా నారాయణగిరి గార్డెన్స్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన 18 షెడ్లతో పాటు మాడావీధుల్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన తాత్కలిక షెడ్లు క్రింద భక్తులు ప్రశాంతంగా వేచిఉన్నారు. మరోవైపు పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా టీటీడీ ఊహించిన స్థాయి కంటే తక్కువ సంఖ్యలో భక్తుల రద్దీ ఉండడం విశేషం.