పశ్చిమాసియాలో యుద్ధభేరి

Update: 2018-04-14 05:42 GMT

పశ్చిమాసియాలో యుద్ధభేరి మోగింది. సిరియాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. సిరియా రాజధాని డమాస్కస్ లక్ష్యంగా అర్థరాత్రి దాడులు చేసింది. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్ బలగాలు ఉమ్మడిగా వైమానిక దాడి చేశాయి. సిరియాలో దాడులు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. 

సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలో ఇటీవల రసాయనిక దాడుల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు, పిల్లలు చనిపోయారు. ఈ దాడులకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ బాధ్యుడని ని ట్రంప్ ఆరోపించారు. కెమికల్ దాడులను ఆపడంలో అసద్‌ కు మద్దతిస్తున్న రష్యా విఫలమైందని అన్నారు. రసాయనిక దాడులకు కారణమైన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై చర్యలు చేపట్టామని చెప్పారు.
 

Similar News