సీఎం చంద్ర‌బాబును ఆకాశానికెత్తేస్తున్న టీఆర్ఎస్ నేత‌లు

Update: 2018-01-23 07:27 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్ర‌బాబు, సీఎం కేసీఆర్ లు ఎవ‌రి ప‌రిపాల‌నలో వారు బిజీగా ఉంటున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లే ప‌రిష్కార మార్గంగా ప‌రిపాల‌న ద‌క్ష‌త‌తో అభివృద్ధి ప‌థంవైపు దూసుకెళుతున్నారు. రాష్ట్ర‌విభ‌జ‌న త‌రువాత కూడా నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న వీరిద్ద‌రు కయ్యానికి కాలు దువ్వే వారు. సంద‌ర్భాను సారం ఒక‌రిపై విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో కాక‌పుట్టించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రాలు వేరైనా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి ఉండాల‌నే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఆకాశానికెత్తేస్తున్నారు. 
కొద్దిరోజుల క్రితం టెక్ మ‌హీంద్రా ఎంఐ - 18 ఆవిష్క‌ర‌ణ దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన మంత్రి కేటీఆర్ ..సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంల వ‌ర్షం కురిపించారు. హైదరాబాద్ ఈ రోజు ఒక ఐటి హబ్‌గా మారడానికి దానికి కార‌ణం చంద్ర‌బాబని కొనియాడారు.  17ఏళ్లలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి గొప్ప సంస్థలు భాగ్యనగరానికి వచ్చాయంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా ఎంతో ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి కూడా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఆంథోల్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్.. సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. విజ‌య‌న‌గ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బాబుమోహ‌న్ మాట్లాడుతూ  చంద్రబాబుని గొప్ప పరిపాలనాదక్షుడని అభివర్ణించారు. గ‌తంలో టీడీపీలో పని చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్న ఆయ‌న ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ముందడుగు వేయడం చంద్రబాబుకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం అని అన్నారు. చంద్రబాబులో ఇప్పటికి అదే వేగం, పట్టుదల కనిపిస్తున్నాయని అన్నారు.
 

Similar News